ఈ ఉగాది కి తమ ప్రేక్షకులందరికీ షడ్రుచుల అమృతాన్ని ఒడ్డించబోతుంది ‘అమృతం ద్వితీయం’

  • February 24, 2020 / 09:19 PM IST

భారత దేశపు అతి పెద్ద కాంటెక్ టెక్నాలజీ బ్రాండ్ అయిన zee5 నెటవర్క్ ప్రేక్షకులకి ఎల్లప్పుడూ ఉన్నత కంటెంట్ ను అందించడంలో ముందంజలో ఉంటుంది. అన్ని భాషల్లోనూ, అన్ని జోనర్స్ లోను ఒరిజినల్స్ యొక్క అతి పెద్ద సృష్టికర్త zee5 మరియు Lightbox Media అధినేత శ్రీ గుణ్ణం గంగరాజు గారు కలిసి అమృతం ద్వితీయం నిర్మించడం జరుగుతుంది. అమృతం 2001 లో సిట్ కామ్ గా ప్రారంభమై బుల్లి తెర వీక్షకులకు హాస్యాన్ని పంచి పెట్టింది. ఆంజనేయులు, అమృత రావు అనే ఇద్దరు స్నేహితులు కలిసి తమ రెస్టారెంట్ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి విన్నూతనమైన ఐడియాస్ వేస్తుంటారు కానీ వాటిని అనుకోని సంఘటనలు, సందర్భాలు పలకరించడంతో చతికిలపడుతుంటారు. ఈ సిట్ కామ్ లో శివాజీ రాజా, నరేష్, హర్ష వర్ధన్ మరియు గుండు హనుమంత రావు ప్రధాన పాత్రల్లో నటిస్తే, వాసు ఇంటూరి, సర్వం అనే నమ్మకస్తుడైన పనివాడి పాత్ర పోషించగా, శివ నారాయణ హింసించే ఇంటి ఓనర్ అప్పాజీ పాత్రలో నటించారు.

అమృతం బుల్లి తెర పై వీక్లీ సీరియల్ గా ఆరు సంవత్సరాలపాటు ప్రసరమైయింది. పదమూడు సంవత్సరాల తరువాత మళ్ళి లొల్లి చెయ్యడానికి ప్రేక్షకులను కవ్వించి నవ్వించడానికి Lightbox Media ప్రీమియర్ ఎక్సక్లూసివ్ గా zee5 లో ప్రసారం కాబోతుంది. అమృతం ద్వితీయం లో హర్షవర్ధన్, శివ నారాయణ, వాసు ఇంటూరి, రాగిణి పూర్వ పాత్రలే పోషించగా, L.B శ్రీరామ్ అంజి పాత్రలో, సత్య క్రిష్ణ అమృతం భార్య సంజీవిని పాత్రలో కనబడనున్నారు. కాశీ విశ్వనాథ్ మరియు రాఘవ కీలకమైన పాత్రలు పోషించారు. ఈ ఉగాది నుంచి మీ zee5 లో మొదటి ఆట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus