‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ వల్ల నిరాశపరిచిన 10 సినిమాలు ఏంటో తెలుసా?
July 22, 2024 / 10:23 AM IST
|Follow Us
ఓ సినిమా సక్సెస్ అయినప్పుడు దాని క్రెడిట్ అందరికీ దక్కాలి అంటారు. కానీ హీరో, డైరెక్టర్..లకు మాత్రమే ఎక్కువ వెళ్తుంది. ఒకవేళ ప్లాపైతే మిగిలిన అంశాలు చర్చల్లోకి వస్తాయి. ఏదేమైనప్పటికీ ఓ క్వాలిటీ ప్రోడక్ట్ బయటకి రావాలి అంటే అది అందరి సహకారంతోనే జరుగుతుంది. అది లోపిస్తే సినిమా ఫలితం తేడా కొట్టేస్తుంది. అందుకు కొన్ని సినిమాలని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అవేంటో మీరే చూడండి:
మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2015 లో విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా షూటింగ్ టైంలో దర్శకుడు శ్రీను వైట్ల, రైటర్స్ కోన వెంకట్ (Kona Venkat), గోపీమోహన్ ల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. సినిమా రిలీజ్ అయ్యాక కూడా వీరు ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి దిగడం కూడా జరిగింది.
మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2016 లో రిలీజ్ అయ్యి పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇదే కాంబినేషన్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) అనే హిట్ సినిమా వచ్చింది. అయితే ‘బ్రహ్మోత్సవం’ సినిమా ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్ళింది. మహేష్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించాడు. అందువల్ల మహేష్ – శ్రీకాంత్..ల మధ్య గ్యాప్ ఏర్పడింది. సినిమా ఔట్పుట్ కూడా అలాగే వచ్చిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ (Nandamuri Balakrishna) బయోపిక్ ని ముందుగా తేజ దర్శకత్వంలో మొదలుపెట్టారు. కానీ బాలయ్య – తేజ (Teja) …ల మధ్య కనెక్టివిటీ కుదర్లేదు. అందువల్ల అతన్ని తప్పించి క్రిష్ (Krish Jagarlamudi) తో ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లారు బాలయ్య. సరైన కాన్ఫ్లిక్ట్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు రెండు పార్టులు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.
4) కల్కి :
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమా రూపొందింది. 2019 లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా షూటింగ్ టైంలో రాజశేఖర్ కి, దర్శకుడు ప్రశాంత్ వర్మ.. మధ్య ఏదో ఒక మాట తేడా రావడం. సరైన విధంగా షూటింగ్ జరగకపోవడం. బడ్జెట్ పెరిగిపోయి నిర్మాత ఇబ్బంది పడటం జరిగింది. ఫైనల్ గా సినిమా ఔట్పుట్ కూడా ఆశించిన విధంగా రాలేదు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘ఆచార్య’ రూపొందింది. 2022 లో విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా కథ విషయంలో జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చరణ్ (Ram Charan) పాత్ర విషయంలో చిరంజీవి మార్పులు చెప్పడం, అది కొరటాలకి నచ్చకపోవడం.. అలా అనేక ప్రతికూల పరిస్థితుల్లో ఈ సినిమాని కంప్లీట్ చేశారు మేకర్స్. ఔట్పుట్ కూడా మెగా అభిమానులని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది అని చెప్పాలి.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము.. అంటూ నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) పరోక్షంగా ఓ లెటర్ రిలీజ్ చేయడం సంచలనం సృష్టించింది. షూటింగ్లో కూడా హీరో, డైరెక్టర్..ల మధ్య కమ్యూనికేషన్ కుదరకపోవడంతో ఇబ్బంది పడుతూనే సినిమా కంప్లీట్ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఔట్పుట్ చూశాక అది నిజమే అని ఒప్పుకోక తప్పలేదు.
నితిన్ (Nithin Kumar) , వక్కంతం వంశీ (Vakkantham Vamsi) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది. స్క్రిప్ట్ విషయంలో హీరో, డైరెక్టర్, నిర్మాతల.. మధ్య సఖ్యత లోపించడంతో .. సినిమా ఔట్పుట్ తేడా కొట్టేసింది.
కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి ముందుగా నవీన్ మేడారం (Naveen Medaram) డైరెక్టర్ గా ఎంపికయ్యారు. కానీ చివర్లో అతని పేరు తీసేసి డైరెక్టర్ గా అభిషేక్ నామా (Abhishek Nama) పేరు వేసుకోవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. సినిమా కూడా అంతగా ఆడలేదు.
త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకి ముందుగా అనుకున్న కథ ఒకటి. తర్వాత మార్చిన కథ ఒకటి. ఫైనల్ గా బయటకి వచ్చిన కథ ఇంకోటి. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ అనుకున్నారు. ఆమెను తప్పించి శ్రీలీలని (Sreeleela) మెయిన్ హీరోయిన్ ని చేశారు. ఇలా చాలా క్రియేటివ్ డిఫరెన్సెస్ నడుమ తెరకెక్కిన ఈ సినిమా కూడా ఆశించిన సక్సెస్ ను అందుకోలేదు.
కల్ట్ బ్లాక్ బస్టర్ ‘భారతీయుడు’ కి సీక్వెల్ గా రూపొందిన ‘భారతీయుడు2’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ టైంలో ప్రమాదం చోటు చేసుకోవడం.. ఆ తర్వాత బడ్జెట్ పెరిగిపోయింది అంటూ శంకర్ (Shankar) పై నిర్మాతలు ఫైర్ అవ్వడం. ఈ గొడవలతో శంకర్ బయటకి వచ్చేసి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మొదలుపెడితే.. ‘లైకా’ వారు శంకర్ పై కేసు వేయడం..! ఇలాంటి వివాదాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. వాటి నడుమ తెరకెక్కిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. పార్ట్ 3 ఉంటుంది అంటున్నారు. కానీ అది రిలీజ్ అయ్యే వరకు అనుమానమే..!