Rahul Ravindran: రుహానీ శర్మను తెగ పొగిడేసిన ఫస్ట్ డైరక్టర్.. ఆ సినిమా సంగతి మీకు తెలుసా?
August 25, 2024 / 03:33 PM IST
|Follow Us
కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు చూడటానికి ఏదో సాధారణంగా కనిపిస్తాయి. కానీ వాటిలో నటించి మెప్పించడం చాలా కష్టం. అలా మెప్పించిన పాత్రలు ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోతాయి. తాజాగా ‘ఆగ్రా’ అనే సినిమాలో యువ కథానాయిక రుహానీ శర్మ (Ruhani Sharma) అలాంటి పాత్రే చేసింది అంటున్నారు. తాజాగా ఆమె గురించి ఆమె మొదటి సినిమా (తెలుగులో) దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) కూడా మాట్లాడారు. రుహానీ శర్మ నటించిన ‘ఆగ్రా’ అనే సినిమా గతేడాది కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రత్యేకంగా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Rahul Ravindran
మన దగ్గర సినిమా రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే ఆ సినిమాలో రుహానీ నటించిన కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతోపాటు ఆ వీడియోలు ఆమె పర్సనల్ వీడియోలు అంటూ ట్రోల్ కూడా చేస్తున్నారు. ఆ విషయంలో ఆమె అసహనం కూడా వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు ఈ విషయంలో ఆమె తెలుగులో నటించిన తొలి సినిమా ‘చి.ల.సౌ’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఆమెకు సపోర్టుగా మాట్లాడారు.
రుహానీతో కలసి పనిచేయడం, ఆమె ప్రతిభను దగ్గరుండి చూడట నా జీవితంలో అత్యుత్తమమైన అనుభవాల్లో ఒకటి అని చెప్పొచ్చు. ఆమె గొప్ప నటి.. అయినా కొంచెం కూడా గర్వం ఉండదు. నేను ‘ఆగ్రా’ సినిమా ఇంకా చూడలేదు. కానీ కథ గురించి విన్నాను. ఆ సినిమా గొప్పతనం గురించి కూడా తెలుసుకున్నాను అని రాహుల్ చెప్పాడు. ‘ఆగ్రా’ సినిమా లాంటి స్క్రిప్ట్‌లను సెలక్ట్ చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి.
అలాంటి సినిమా ఎంచుకున్న రుహానీ లాంటి ధైర్యవంతురాలు మన ఇండస్ట్రీలో ఉండటం మన అదృష్టం. ఆమె లాంటి చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి అవసరం అని తన పోస్టులో రాహుల్ రవీంద్రన్ రాసుకొచ్చారు. ఆ పోస్ట్‌కు రుహానీ కూడా రిప్లై ఇచ్చింది. తనకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పింది. రాహుల్ (Rahul Ravindran) మాటలు తనకు ధైర్యాన్ని ఇచ్చాయి అని కూడా చెప్పింది.