Ram Charan: కూతురికి చరణ్ ఇచ్చిన బహుమతి ఏంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
August 24, 2024 / 12:28 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) ఆచార్య (Acharya) తర్వాత కొంత గ్యాప్ వచ్చినా ఇకపై వరుస సినిమాలలో నటించేలా కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కూతురు క్లీంకారకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని చరణ్ పలు సందర్భాల్లో వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి కూతురు క్లీంకార గురించి రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మగధీర (Magadheera) సినిమాలో స్వారీ చేసిన గుర్రాన్ని రామ్ చరణ్ తన ఫామ్ హౌస్ లో పెంచుతున్నారు.
Ram Charan
ఈ గుర్రానికి రామ్ చరణ్ బాద్ షా అని పేరు పెట్టుకున్నారు. చరణ్ ఫామ్ హౌస్ లో ఈ గుర్రంతో పాటు మరో 15 గుర్రాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. చరణ్ మాట్లాడుతూ నాకు మూగజీవాలంటే ఎంతో ఇష్టమని అలా నా ఫామ్ హౌస్ లో పెంచుకునే గుర్రాలంటే కూడా ఎంతో ప్రీతి అని తెలిపారు. మగధీరలో నేను గుర్రపు స్వారీ చేసిన గుర్రం పేరు బాద్ షా అని షూట్ అయిపోయాక ఆ గుర్రం కావాలని జక్కన్నను అడిగి ఇంటికి తెచ్చేసుకున్నానని చరణ్ పేర్కొన్నారు.
ఈ మధ్యే ఆ గుర్రం బిడ్డకు జన్మనిచ్చిందని దాన్ని నా కూతురికి గిఫ్ట్ గా ఇచ్చానని చరణ్ వెల్లడించారు. ఇంత చిన్న వయస్సులోనే క్లీంకార ఆ చిన్న గుర్రంపై ఎక్కి స్వారీ చేసేందుకు ప్రయత్నిస్తోందని రామ్ చరణ్ పేర్కొన్నారు. గుర్రపు స్వారీ విషయంలో నా అభిరుచి, నా కూతురి అభిరుచి సేమ్ టు సేమ్ అని రామ్ చరణ్ తెలిపారు.
రామ్ చరణ్ చెప్పిన విషయాలు అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. రామ్ చరణ్ పారితోషికం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది. చరణ్ భిన్నమైన కథాంశాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసే హిట్లను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.