Filmfare Awards: ఫిలింఫేర్లో ‘ఆర్ఆర్ఆర్’కి అవార్డుల పంట.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?
July 12, 2024 / 04:14 PM IST
|Follow Us
రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రామ్‌చరణ్ (Ram Charan), తారక్ (Jr NTR) నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). 2022లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు సాధించి అదరగొట్టింది. ఇప్పుడు 68వ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కూడా రికార్డులు బద్దలుకొట్టింది. ఆ సినిమాతోపాటు ‘సీతారామం’ (Sita Ramam) సినిమాకు కూడా అవార్డుల పంట పండింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏడు విభాగాల్లో అవార్డులు వచ్చయి. అవార్డుల జాబితా చూస్తే.. ఉత్తమ చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచిది. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి నిలిచారు.
ఇక ఉత్తమ నటుడు అవార్డును ఈ సారి సంయుక్తంగా రామ్‌చరణ్, తారక్‌కు ఇచ్చారు. ఉత్తమ నటిగా ‘సీతారామం’ సినిమాకు గాను మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పురస్కారం దక్కించుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా ‘భీమ్లా నాయక్’లోని (Bheemla Nayak) నటనకుగాను రానా (Rana Daggubati) అవార్డు గెలుచుకున్నారు. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ దర్శకుడిగా ‘సీతారామం’ తెరకెక్కించిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) నిలిచారు. ఈ సినిమాకే ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) పురస్కారం కూడా దక్కింది. ఈ విభాగంలోనే ఉత్తమ నటిగా సాయిపల్లవి (Sai Pallavi) నిలిచింది. ‘విరాట పర్వం’ (Virata Parvam) సినిమాకుగాను ఆమె ఈ పురస్కారం ఇచ్చారు.
ఇదే సినిమాలో నటనకుగాను నందితా దాస్ (Nandita Das) ఉత్తమ సహాయ నటి పురస్కారం గెలుచుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’కి అందించిన సంగీతానికి గాను కీరవాణి (M. M. Keeravani) ఉత్తమ మ్యూజిక్ డైరక్టర్ అవార్డు పొందారు. ‘సీతారామం’ సినిమాలోని ‘కానున్న కల్యాణం..’ అనే పాటను రాసిన దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఉత్తమ గీత రచయిత పురస్కారం దక్కించుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా కాల భైరవ (Kaala Bhairava) నిలిచాడు. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘కొమురం భీముడో..’ పాటకు ఈ పురస్కారం దక్కింది.
‘సీతారామం’లో ‘ఓ ప్రేమ..’ పాట పాడిన చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) ఉత్తమ గాయని పురస్కారం అందుకున్నారు. ‘నాటు నాటు’ పాటకు నృత్య రీతులు సమకూర్చినందుకుగాను ప్రేమ్ రక్షిత్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్.. సినిమాకు ప్రొడక్షన్ డిజైన్ చేసినందుకు సాబు సిరిల్‌కు ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ పురస్కారం దక్కింది. గతేడాది జరగాల్సిన ఈ కార్యక్రమం వివిధ కారణాల వల్ల ఈ ఏడాది జరిగింది.