Kalki 2898 AD: మహేష్ బాబు రీజనల్ సినిమా రికార్డుని ప్రభాస్ పాన్ ఇండియా సినిమా కొట్టలేకపోయిందా?
June 13, 2024 / 04:01 PM IST
|Follow Us
ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ad ‘(Kalki 2898 AD) . నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని ‘వైజయంతి మూవీస్’ సంస్థ ఏకంగా రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. జూన్ 7 న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. విజువల్స్ చాలా బాగున్నాయి. హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఉంది అనే రెస్పాన్స్ ను కూడా రాబట్టుకుంది.
అయితే ఎందుకో ఈ ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేయలేకపోయింది. తెలుగు ట్రైలర్..కి కేవలం 14.43 మిలియన్ వ్యూస్ మాత్రమే నమోదయ్యాయి. చెప్పాలంటే ఇవి చాలా తక్కువ. ఇప్పటివరకు హయ్యెస్ట్ వ్యూస్ నమోదు చేసిన తెలుగు ట్రైలర్స్ ని గమనిస్తే :
1) గుంటూరు కారం (Guntur Kaaram) : 37.65 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి
2) సలార్ (Salaar) : 32.58 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి
3) సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) : 26.77 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి
4) రాధే శ్యామ్ (Radhe Shyam) : 23.20 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి
5) ఆచార్య (Acharya) : 21.86 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి
6) బాహుబలి 2 (Baahubali 2) : 21.81 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి
7) ఆర్.ఆర్.ఆర్ (RRR) : 20.45 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి
8) కె.జి.ఎఫ్ 2 (KGF2) : 19.38 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి
9) బ్రో (Bro Movie) : 19.25 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి
10) వకీల్ సాబ్ (Vakeel Saab) : 18.05 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి
‘ ‘కల్కి 2898 ad’ ట్రైలర్ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయింది. రీజనల్ మూవీ అయిన ‘గుంటూరు కారం’ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేయలేకపోయింది. కాబట్టి సినిమా పై అంచనాలు సన్నగిల్లాయి అని అర్థమవుతుంది’.. 24 గంటలు గడిచిన తర్వాత చాలా మంది నుండి వినిపిస్తున్న కామెంట్స్ ఇవే. అయితే అన్ని పెద్ద సినిమాలకు డిజిటల్ టీం అనేది ఉంటుంది.
బాట్స్ వంటివి ఉపయోగించి ఎక్కువ వ్యూస్ వచ్చేలా చేస్తుంటాయి ఆ టీం..లు..! కానీ ‘కల్కి’ కి ఆ టీం లేదేమో..! అందుకే ఇంత తక్కువ వ్యూస్ వచ్చాయేమో. అలా అని ఒక్కో ‘వ్యూ’ థియేటర్ దగ్గర ఒక్కో టికెట్ గా కన్వర్ట్ అవుతుంది అనడానికి ఏమీ లేదుగా. చూద్దాం..!