Namitha: ఫస్ట్ ప్రెగ్నెన్సీ సమయంలో అలా జరిగింది.. నమిత కామెంట్స్ వైరల్!
June 13, 2024 / 01:01 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో నమిత (Namitha) ఒకరు. తెలుగులో సొంతం, జెమిని (Gemeni) , నాయకుడు. బిల్లా (Billa) సినిమాలలో ఆమె నటించగా ఈ సినిమాలలో బిల్లా కమర్షియల్ గా హిట్ గా నిలిచింది. తెలుగుతో పాటు సౌత్ ఇండియాలోని ఇతర భాషల్లో సైతం నమిత నటించడం జరిగింది. 2020 సంవత్సరంలో మాయ అనే సినిమాలో నటించిన నమిత ఆ సినిమా తర్వాత మరే సినిమాలో నటించలేదు.
అయితే నమిత తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ 2021లో తొలిసారి గర్భవతి అయ్యానని అప్పుడు నేను సూరత్ లో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని నమిత పేర్కొన్నారు. ఆ సమయంలో అమ్మానాన్న నాతో పాటు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. నేను నాన్న దగ్గరకు వెళ్లి నాన్నతో తాత కాబోతున్నావని చెప్పానని ఆమె పేర్కొన్నారు.
ఆ తర్వాత నా భర్తతో ఆ గుడ్ న్యూస్ ను షేర్ చేశానని నమిత వెల్లడించారు. అయితే ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదని నమిత చెప్పుకొచ్చారు.నాలుగు నెలలకే నాకు అబార్షన్ కావడంతో నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఆమె వెల్లడించారు. ఆ తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యానని ఆమె వెల్లడించారు. మూడు నెలలకే ట్విన్స్ అని తెలిసిందని నమిత పేర్కొన్నారు. నేను ఎప్పుడూ బెడ్ పై ఉండేదానినని ఆమె చెప్పుకొచ్చారు.
ఎక్కువగా నడవకూడదని మెట్లు ఎక్కకూడదని భర్త ఆంక్షలు పెట్టారని ఆమె తెలిపారు. ఏడు నెలల వరకు పొట్ట కనిపించకపోవడంతో భయం వేసిందని ఆ తర్వాత పొట్ట పెరగడంతో ఊపిరి పీల్చుకున్నానని నమిత వెల్లడించారు. నమిత చెప్పిన ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. నమిత ఇన్ని కష్టాలను ఎదుర్కొన్నారని ఇన్ని ఇబ్బందులు పడ్డారని తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.