ప్రజల మాట విన్నాం అంటూ కొత్ ప్రయత్నం చేస్తున్న మల్టీప్లెక్స్ చైన్!
April 25, 2024 / 10:29 AM IST
|Follow Us
10.30కి షో స్టార్ట్ అంటే… కంగారేం లేదు 10.45కి వెళ్దాం అని అనుకుంటూ ఉంటారు సినిమా గోయర్స్. దానికి కారణం సినిమా స్టార్టింగ్‌కి ముందు వాళ్లు వేసే యాడ్సే. గూడ్స్ రైలు బండి వచ్చినట్లే ఒక దాని తర్వాత ఒకటి యాడ్ వస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ఆ మల్టీప్లెక్స్ స్క్రీన్స్‌లో ఉన్నవాళ్లలో అసహనం కూడా మీరు చూసుంటారు. అంతెందుకు మీరు కూడా అలానే అనుకొని ఉంటారు కూడా. ఇప్పుడు ఈ ఇబ్బందిని తొలగించాలని ఆ మల్టీప్లెక్స్ చైన్ ప్లాన్ చేసింది.
మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూడటానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్యను పెంచేందుకు, ఎక్కువ షోలు వేసేందుకు పీవీఆర్ ఐనాక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా షోలు ప్రారంభానికి ముందు వేసే యాడ్స్‌ను ఆపేయాలని నిర్ణయించింది. వివిధ నగరాల్లో ఉన్న లగ్జరీ మల్టీప్లెక్స్‌ల్లో ఇప్పటికే యాడ్స్‌ను రద్దు చేసిన పీవీఆర్ మరికొన్ని చోట్ల అదే విధానాన్ని అమలు చేయబోతోంది. అలా అని పూర్తిగా ఆపేయకుండా.. సినిమా ట్రైలర్లు, టీజర్లు మాత్రమే వేయాలని అనుకుంటోంది.
దీంతో 35 నిమిషాల యాడ్ స్లాట్‌ను 10 నిమిషాలకు తగ్గుతుంది. దాని ద్వారా ప్రేక్షకులకు ఇబ్బంది తగ్గుతుంది… అలా ఓ అదనపు షోస్ వేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్వెల్లో కూడా ప్రేక్షకులు యాడ్స్‌ను చూసేందుకు ఇష్టపడట్లేదని గుర్తించిన సంస్థ… సినిమాల ట్రైలర్లను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అర్థం చేసుకుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీవీఆర్ ఐనాక్స్ తెలిపింది.
యాడ్స్ లేకపోవడం వల్ల సంస్థకు నష్టం వస్తుంది. అయితే అదనపు షోల వల్ల ఆ నష్టాన్ని భర్తీ చేయొచ్చు అని అనుకుంటోంది. యాడ్ ఫ్రీ విధానం తొలుత దిల్లీ, ముంబయి, బెంగళూరులో ఉన్న డైరెక్టర్స్ కట్, ఇన్సిగ్నియా స్క్రీన్స్‌లో ఉంది. త్వరలో పుణెలో ప్రారంభిస్తారట. ఆ తర్వాత కొన్ని నెలల్లో మిగిలిన ప్రాంతాలకు ఈ విధానం వెళ్తుంది అని పీవీఆర్ తెలిపింది.