TG Vishwa Prasad: ఆ సినిమా పరాజయానికి కారణాలు చెప్పుకొచ్చిన టీజీ విశ్వప్రసాద్.!
August 24, 2024 / 01:16 PM IST
|Follow Us
ఒక సినిమాకి రిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది పాజిటివా లేక నెగిటివా అనేది పక్కన పెడితే.. ప్రతి సినిమాకి ప్రీరిలీజ్ బజ్ అనేది చాలా ముఖ్యం. కొన్ని సినిమాలకు టీజర్ స్టేజ్ నుంచే మంచి బజ్ ఉంటుంది, ఇంకొన్ని సినిమాలకు విడుదల తర్వాత పాజిటివ్ టాక్ బట్టి బజ్ క్రియేట్ అవుతుంది. అయితే.. ఆగస్ట్ 15న విడుదలైన “మిస్టర్ బచ్చన్” (Mr Bachchan) విషయంలో మాత్రం మొదటి పాట విడుదల నుండే విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది.
TG Vishwa Prasad
అయితే.. దర్శకనిర్మాతలు ఆ నెగిటివిటీని పబ్లిసిటీ కోసం వాడుకున్నారు. కట్ చేస్తే.. సినిమా ప్రీమియర్ షోస్ నుండే నెగిటివ్ టాక్ మూటగట్టుకొని ఫ్లాప్ టాక్ తెచ్చుకొని ఆఖరికి డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది “మిస్టర్ బచ్చన్”. ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ పై స్పందించాడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad). ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..
“సినిమాలో అంత దమ్ము లేదు, అలాగని మరీ ఇంత పెద్ద ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా కూడా కాదు. ఫస్టాఫ్ టైమ్ పాస్ అవుతుంది కానీ.. సెకండాఫ్ మాత్రం చాలా పేలవంగా ఉంది. అయితే.. సినిమాను కొందరు టార్గెట్ చేసి మరీ ఫ్లాప్ చేసారు తప్పితే.. మరీ ఇలా ఫెయిల్ అవ్వాల్సిన సినిమా మాత్రం కాదు” అంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే.. ఈ ఇంటర్వ్యూలో కొన్ని బిట్స్ ను ట్విట్టర్లో పోస్ట్ చేసి హరీష్ శంకర్ ను Harish Shankar) టార్గెట్ చేయడం మొదలెట్టారు కొందరు. హరీష్ శంకర్ రిలీజ్ కి ముందు చేసిన హడావుడి వల్లే ఇలా అయ్యిందని ఇంకొన్ని వెబ్ సైట్స్ రాతలు కూడా మొదలెట్టాయి. మరి ఈ విషయమై మళ్ళీ హరీష్ శంకర్ రెస్పాండ్ అవ్వడం మొదలెడతాడో లేదో చూడాలి.