Star Producer: చిక్కుల్లో పడ్డ నిర్మాత.. రూ.కోట్లు డిమాండ్ చేస్తున్న నటి.. ఏమైందంటే?
August 23, 2024 / 10:28 PM IST
|Follow Us
క్యాస్టింగ్ కౌచ్ అనేది కొత్త వ్యవహారం కాదు. ‘సినీ పరిశ్రమకి అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకి మాయమాటలు చెప్పి(అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి) వారిని శారీరకంగా అనుభవిస్తున్నారు.. తర్వాత వారిని ఏదోక రకంగా వదిలించుకుంటున్నారు’ అంటూ గతంలో చాలా వార్తలు వచ్చాయి. వాటివల్ల ‘మీటూ’ ఉద్యమం కూడా పుట్టుకొచ్చింది. దాని హడావిడి ఒక రెండేళ్ల పాటు నడిచింది. కానీ ఈ అంశం పై చాలా మంది నటీమణులు పూర్తిగా ఓపెన్ అవ్వలేదు.బహుశా అవకాశాలు రావేమో అనే భయంతో కావచ్చు.
సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు ఫిలింనగర్లో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. విషయంలోకి వెళితే.. ప్రముఖ నిర్మాత (Star Producer) తన సినిమాలో చేసిన ఓ నటితో ఎఫైర్ పెట్టుకున్నాడట. ఆమెకు కడుపు కూడా చేసినట్లు టాక్. తర్వాత ఆమెకు మొహం చాటేస్తున్నాడట. దీంతో ఆమె సినీ పెద్దలను సంప్రదించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని బయటకు రాకుండా చేయడానికి వారు ఆమెను కూల్ చేస్తున్నారని సంచరం. ఈమెను ఆ నిర్మాత చేరదీయడానికి(పెళ్లి చేసుకోవడానికి) అయితే ఇష్టపడట్లేదట.
ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోవాలని అతను భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ నటి రూ.10 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. అయితే అంత మొత్తం ఇవ్వడానికి ఆ నిర్మాత ఒప్పుకోలేదట. రూ.3 కోట్లకి సెటిల్ చేసుకుందామని చెప్పాడట. ఇందుకు కూడా ఆ నటి ఓకే చెప్పినట్టు సమాచారం. కానీ ఆ నిర్మాత (Star Producer) కొద్దిరోజులుగా అందుబాటులో లేడట. ప్రస్తుతం అతను అమెరికాలో ఉన్నట్టు టాక్. ఎటువంటి రెస్పాన్స్ అతను ఇవ్వడం లేదు కాబట్టి..
ప్రెస్ మీట్ పెట్టి తాను గర్భం దాల్చిన విషయాన్ని బయట పెట్టాలని చూస్తుందట నటి. అయితే ‘కంగారు పడొద్దు’ అని సినీ పెద్దలు చెబుతున్నారట. మరి ఏమవుతుందో చూడాలి. ఇక ఆ నిర్మాత విషయానికి వస్తే.. అతని మొదటి సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ ఉత్సాహంలో చేసిన రెండో సినిమా ప్లాప్ అయ్యింది. ఇప్పుడు ఓ మిడ్ రేంజ్ హీరోతో సినిమా సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు.