Telangana Theaters: తెలంగాణ థియేటర్ యాజమాన్యం షాకింగ్ డెసిషన్
May 15, 2024 / 02:59 PM IST
|Follow Us
సమ్మర్ సీజన్ అనేసరికి పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతూ ఉండాలి. కానీ ఈ ఏడాది మాత్రం పూర్తిగా జనాలు లేక బోసిపోయాయి. ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) తర్వాత ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాలేదు. మరోపక్క ఐపీయల్ సీజన్, ఎలక్షన్స్ హడావిడి.. ఇవన్నీ జనాలను థియేటర్స్ కి రాకుండా చేసేశాయి అని చెప్పాలి. పోనీ మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకి అయినా జనాలు వస్తున్నారా? అంటే అలాంటిది కూడా జరగట్లేదు.
‘పాండమిక్ టైంలో కూడా ఇలాంటి ఘోరమైన పరిస్థితులు లేవు అంటూ’ థియేటర్ యాజమాన్యాలు నెత్తి నోరు కొట్టుకుంటున్నాయి. అందుకే తెలంగాణ థియేటర్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయానికి వచ్చింది. 10 రోజుల పాటు థియేటర్స్ ని మూసేయాలని నిశ్చయించుకున్నాయి. అవును 10 రోజుల పాటు తెలంగాణాలో ఉండే సింగిల్ స్క్రీన్స్ మూసేయాలని థియేటర్ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాయి.
దీని వల్ల కరెంట్ బిల్లులు అయినా ఆదా చేయవచ్చు అనేది వారి ఉద్దేశం. మెయింటెనెన్స్ లు వంటివి థియేటర్లు మూసి ఉన్నా మామూలే. స్టాఫ్ కి జీతాలు ఇవ్వాల్సిందే. కానీ కనీసం కరెంటు బిల్లుల రూపంలో అయినా 10 రోజులకి లక్షల్లో ఆదా చేయవచ్చు అనేది వారి ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది.
అందుకే వారు ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మల్టీప్లెక్సులు నార్మల్ గానే రన్ అవుతాయి అని తెలుస్తుంది. అయినప్పటికీ సింగిల్ స్క్రీన్స్ లేకుండా ఈ 10 రోజులు అంటే 2 శుక్రవారాలను ఆధారం చేసుకుని.. కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.