Kannappa: ‘కన్నప్ప’ కోసం స్టార్ల పారితోషికాల వివరాలు ఇవే..!
May 15, 2024 / 09:54 AM IST
|Follow Us
మంచు విష్ణు (Manchu Vishnu) ‘కన్నప్ప’ (Kannappa) రోజు రోజుకీ హాట్ టాపిక్ అవుతుంది. 20 వ తేదీన టీజర్ ను కూడా లాంచ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ‘మహాభారతం’ అనే హిందీ సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’కి దర్శకుడు. ‘అవా ఎంటర్టైన్మెంట్స్’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంస్థల పై మంచు విష్ణు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopala Krishna) , బుర్రా సాయి మాధవ్ (Sai Madhav Burra) , తోట ప్రసాద్ వంటి స్టార్స్ ‘కన్నప్ప’ స్క్రిప్ట్ డెవలప్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.
న్యూజిల్యాండ్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, (Akshay Kumar) , శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మోహన్ లాల్ (Mohanlal) తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా ‘కన్నప్ప’ లో భాగం అయ్యారు. ఈ క్రమంలో ఆ స్టార్స్ ‘కన్నప్ప’ కోసం ఎంత పారితోషికం తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు కూడా షికార్లు చేస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం… ‘కన్నప్ప’ కోసం శివరాజ్ కుమార్, మోహన్ లాల్.. లు పారితోషికాలు వంటివి తీసుకోవడం లేదట.
ప్రభాస్ కూడా అంతే..! మోహన్ బాబు (Mohan Babu) పై ఉన్న అభిమానంతో ‘కన్నప్ప’ ప్రాజెక్టులో భాగం అయ్యాడు ప్రభాస్. అంతేకాదు.. ప్రభాస్ తో ‘భక్తకన్నప్ప’ ని రీమేక్ చేయాలనేది అతని పెదనాన్న కృష్ణం రాజు (Krishnam Raju) కోరిక. అందుకే ప్రభాస్ ‘కన్నప్ప’ లో నటి అతని పెదనాన్న కోరిక తీరుస్తున్నాడు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం తన రోజువారీ పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది.